మార్కెట్ యార్డ్ లో ఎట్టకేలకు మొక్కలు కొనుగోలు షురూ

by Nallavelli.Anjaneyulu |

దిశ, కొల్లాపూర్ : కొల్లాపూర్ మార్కెట్ యార్డ్ కు రైతులు తెచ్చిన మొక్కజొన్న పంట కొనుగోళ్లు బుధవారం అధికారులు ప్రారంభించారు. ఎకరానికి 25 క్వింటాళ్ల చొప్పున కొనుగోళ్లు చేయడం ప్రారంభించామని మండల

మార్కెట్ యార్డ్ లో ఎట్టకేలకు మొక్కలు కొనుగోలు షురూ
X

దిశ, కొల్లాపూర్ : కొల్లాపూర్ మార్కెట్ యార్డ్ కు రైతులు తెచ్చిన మొక్కజొన్న పంట కొనుగోళ్లు బుధవారం అధికారులు ప్రారంభించారు. ఎకరానికి 25 క్వింటాళ్ల చొప్పున కొనుగోళ్లు చేయడం ప్రారంభించామని మండల వ్యవసాయ అధికారి చిన్న హుస్సేన్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్ రూ. 2400లు ఉంది. రైతులందరూ తాము పండించిన పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకురాగలరని ఆయన కోరారు. బయట మార్కెట్ లో దళారులు చాలా తక్కువ ధరకే కొంటున్నారని, రైతులందరూ కొనుగోలు కేంద్రానికే తమ పంటను తీసుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మార్కెట్ లో ఉన్న రైతులు తేమ శాతం 14% వచ్చిన వారికి టోకెన్స్ ఇవ్వడం జరిగిందన్నారు. రైతుల సౌకర్యార్ధం బుధవారం సెలవు ఉన్నప్పటికీ రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని టోకెన్స్ ఇస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి చిన్న హుస్సేన్ యాదవ్ తెలిపారు.

Next Story