- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెయ్యేళ్ల నాటి పాదాలు.. శివలింగాలను కాపాడుకోవాలి : .పురావస్తు పరిశోధకుడు డా. ఈమని శివనాగిరెడ్డి
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండనాగుల గ్రామం ఉంది. గ్రామ శివారులో ఉన్న శివాలయం ముందున్న బండ పై చెక్కిన పాదాలు, శివలింగాలను

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండనాగుల గ్రామం ఉంది. గ్రామ శివారులో ఉన్న శివాలయం ముందున్న బండ పై చెక్కిన పాదాలు, శివలింగాలను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకులు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు. స్థానిక గంగాగౌరీ రామలింగేశ్వరాలయ కమిటీ అధ్యక్షులు అంబటి లింగమయ్య ఇచ్చిన సమాచారం మేరకు ఆదివారం ఆయన శివాలయం ముందు బండ పై పాదాలు, ఆరు చిన్న శివలింగాలు చెక్కి ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చారిత్రక నేపథ్యం ఉన్న పాదముద్రలు, శివలింగాలు కళ్యాణీ చాళుక్యుల (సా.శ. 11వ శతాబ్దం) కాలం నాటివి అన్నారు. చారిత్రక నేపథ్యానికి సంబంధించిన జ్ఞానం, చరిత్ర పై అవగాహన లేని క్వారీ పని వాళ్ల వల్ల ఆ చారిత్రక గుర్తులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్థానిక నాయకత్వం ఎన్నో దశాబ్దాల చారిత్రక ప్రాధాన్యత గల ఈ శిల్పాలను కాపాడి భావి తరాలకు అందించాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. ఆయనతో పాటు కాట్రాజు తిరుపతయ్య, అంబటి నరసింహ, నిమ్మల రాజు, తెలుగు ఎల్లయ్య, శిల్పి వెంకటరెడ్డి పాల్గొన్నారు.






