- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తండ్రి మరణం.. కన్నీటితో పది పరీక్ష రాసిన కొడుకు
తండ్రిని కోల్పోయిన బాధలో పుట్టెడు దుఃఖం ఒకవైపు.. విద్యార్థి జీవితంలో ఎంతో కీలకమైన పదవ తరగతి పరీక్షలు మరోవైపు. ఇలాంటి పరిస్థితుల్లో తండ్రిని కోల్పోయిన విద్యార్థి బాధను దిగమింగి పదో తరగతి పరీక్షకు హాజరయ్యారు.

దిశ, చారకొండ : తండ్రిని కోల్పోయిన బాధలో పుట్టెడు దుఃఖం ఒకవైపు.. విద్యార్థి జీవితంలో ఎంతో కీలకమైన పదవ తరగతి పరీక్షలు మరోవైపు. ఇలాంటి పరిస్థితుల్లో తండ్రిని కోల్పోయిన విద్యార్థి బాధను దిగమింగి పదో తరగతి పరీక్షకు హాజరయ్యారు. చారకొండ మండల కేంద్రానికి చెందిన మునగాల లోకేష్ కుమార్ ఆర్థిక ఇబ్బందులతో శుక్రవారం సాయంత్రం బలవన్మరణానికి పాల్పడ్డాడు. విద్యార్థి మునగాల మణిదీప్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చారకొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీడీ డాక్య నాయక్ విద్యార్థికి ధైర్యం చెప్పారు. దీంతో శనివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రంలో శనివారం జరిగిన పరీక్ష కేంద్రానికి తీసుకువచ్చి గణితం పరీక్షను రాయించారు. ఇంటికి పెద్ద కుమారుడు మణిదీప్ కావడంతో పరీక్షలు రాసి ఇంటికి గ్రామస్థులు కన్నీరు మున్నీరు అయ్యారు.






