- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆస్తి తగాదాలతో తండ్రి పై కొడుకు దాడి
ఆస్తి తగాదాలతో తండ్రి పై కొడుకు దాడి చేసిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండల పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, మల్యాల : ఆస్తి తగాదాలతో తండ్రి పై కొడుకు దాడి చేసిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మల్యాల మండల కేంద్రానికి చెందిన పెరుమాండ్ల సత్యనారాయణకి తన కుమారుడు మనోజ్ కి మధ్య గొడవ జరిగింది. పెరుమాండ్ల సత్యనారాయణకు ఇద్దరూ భార్యలు. మొదటి భార్య కొడుకు మనోజ్ ఆస్తి తగాదాలతో తరుచూ తండ్రితో గొడవ పడుతుండే వాఉడ. ఈ క్రమంలోనే డబ్బులు ఇవ్వాలని.. లేకుంటే చంపుతానని బెదిరించాడు. చిన్నగా మొదలైన గొడవ ముదిర చివరికీ ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు. ఇదే క్రమంలో కుమారుడు మనోజ్ తండ్రి సత్యనారాయణ పై రోకలితో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే స్థానికులు 108 ద్వారా అంబులెన్స్ లో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. సత్యనారాయణ రెండో భార్య నాగమణి ఫిర్యాదు మేరకు మనోజ్ పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నరేష్ వెల్లడించారు.






