జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

by Elthuri vijay kumar |   (  Updated:2025-09-19 11:51:57  IST  )

మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రపూర్ గ్రామ శివారులో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
X

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

ట్రాక్టర్ ను ఢీకొట్టిన కారు

ఐదుగురు విద్యార్థులకు గాయాలు

బెలున్స్ ఓపెన్ తో తప్పిన పెనుప్రమాదం

దిశ, మక్తల్: మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రపూర్ గ్రామ శివారులో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయచూరు–హైదరాబాద్ జాతీయ రహదారిపై షిఫ్ట్ కారు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన విద్యార్థులు ఉదయ్ (23), శివ (22), సందీప్ (22), వంశీ (22), డ్రైవర్ అంజప్ప (35) గాయపడ్డారు. వారిలో వంశీకి కాలు విరగగా, ఉదయ్‌కి చేయి విరిగింది. డ్రైవర్ అంజప్పకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో ఉదయ్, వంశీని జిల్లా ఆసుపత్రికి తరలించగా, మిగతా ముగ్గురిని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

పోలీసుల సమాచారం ప్రకారం, విద్యార్థులు కర్ణాటకలోని ప్రముఖ కుక్కే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని షిఫ్ట్ కారులో హైదరాబాద్ వైపు వస్తుండగా, దాసరపల్లి గ్రామానికి చెందిన అంజప్ప తన ఇంటి నిర్మాణ పనుల కోసం ఇటుకల బట్టీకి వెళ్తూ ట్రాక్టర్ నడుపుతుండగా ప్రమాదం జరిగింది. ఉదయం సుమారు ఆరు గంటలన్నర సమయంలో చంద్రపూర్ శివారులో ఓ దాబా ముందు ఈ ఘటన జరిగింది. కారు ఢీకొనడంతో ట్రాక్టర్ రెండు ముక్కలైపోయింది. కారులోని సేఫ్టీ ఎయిర్ బెలూన్స్ (ఎయిర్‌బ్యాగ్స్) తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాద స్థలానికి చేరుకున్న మక్తల్ పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇరువర్గాల నుండి ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.

Next Story