- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > ఘోర రోడ్డు ప్రమాదం: లారీని ఢీ కొట్టిన కారు.. ఇద్దరికి తీవ్రగాయాలు
ఘోర రోడ్డు ప్రమాదం: లారీని ఢీ కొట్టిన కారు.. ఇద్దరికి తీవ్రగాయాలు
by Taduka Kalyani |
కారు అదుపుతప్పి డివైడర్ ను దాటి లారీని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

X
దిశ, ఉండవల్లి: కారు అదుపుతప్పి డివైడర్ ను దాటి లారీని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జోగులంబా గద్వాల జిల్లా ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తా సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగింది. బాధితులు హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ దాటి కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది.
దీంతో కారు నుజ్జు నుజ్జు కాగా అందులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు జుబేర్, మహమ్మద్ కారులో ఇరుక్కొని తీవ్ర గాయాలపాలయ్యారు. అందులో మహమ్మద్ పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న హైవే, అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను క్రేన్ సాయంతో బయటకు తీసి కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరు కర్నూల్ కు చెందిన వారు అయి ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా ఈ ప్రమాదానికి కారణం అతివేగమేనని తెలుస్తోంది.
Next Story






