- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

బోల్తా పడ్డ బొలెరో, ఆరేళ్ల చిన్నారి బలి
పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం
ఒకరి మృతి, 10 మందికి గాయాలు
దిశ - మహబూబ్ నగర్ : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిన్నచింతకుంట మండలం దమజ్ఞాపూర్, ఎదులాపూర్, అల్లిపూర్ గ్రామాలకు చెందిన పెళ్లి బంధువులు పాతమొల్గర గ్రామంలో వివాహ వేడుకకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం కలెక్టరేట్ ముందు ఒక్కసారిగా అదుపుతప్పి పల్టీలు కొట్టింది.
ఈ ప్రమాదంలో దమజ్ఞాపూర్ గ్రామానికి చెందిన సాయి వర్షిత్ (6) అనే కుర్రాడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అటు వాహనంలో ఉన్న మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పద్మ, లక్ష్మి, కృష్ణవేణి, కృష్ణయ్య, రాజు, మండ్ల కొండన్న, సురేందర్, తిరుపతయ్య, సత్యనారాయణ గౌడ్‌లుగా గుర్తించారు. ఈ సంఘటనపై పోలీసులు స్పందించి క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.






