పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

by Naveena |

అకాలంగా కురిసిన వడగండ్ల వానకు కష్టపడి పండించిన పంట దెబ్బతిన్నదని,వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనా వేసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫోన్ ద్వారా వ్యవసాయ అధికారులను కోరారు.

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: అకాలంగా కురిసిన వడగండ్ల వానకు కష్టపడి పండించిన పంట దెబ్బతిన్నదని,వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనా వేసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫోన్ ద్వారా వ్యవసాయ అధికారులను కోరారు. శనివారం రాత్రి కురిసిన వడగండ్ల వానకు మహబూబ్ నగర్ మండల పరిధిలోని బొక్కలోనిపల్లి,రామచంద్రాపూర్, తెలుగు గూడెం, జమిస్తాపూర్,తదితర గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. కౌలుకు తీసుకొని అతికష్టంపై పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తే,రాత్రి కురిసిన వడగండ్ల వానకు తీవ్రంగా నష్టపోయమని ఈ సందర్భంగా మహిళా రైతు జ్యోతి కంటతడి పెట్టుకొని బావురుమనగా.. ఆమెకు మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వడగండ్ల వానకు పది రకాల పంటలు తీవ్రంగా నష్టపోతే,అంచనా వేయడానికి కానీ,రైతులను ఓదార్చడానికి కానీ ఎవ్వరూ రాలేదని ఆయన విమర్శించారు. వెంటనే తక్షణ సహాయం కింద పంట నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం 10 వేల రూపాయల సహాయం అందించాలని,ప్రతి ఎకరాకు 40 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట నాయకులు రాజేశ్వర్ గౌడ్,ఆంజనేయులు,దేవేందర్ రెడ్డి,రాజేశ్వర్ రెడ్డి,రవీందర్ రెడ్డి,శ్రీనివాసులు,రాజ్ గోపాల్ యాదవ్,అశోక్ గౌడ్,తదితరులు ఉన్నారు.

Next Story