భూసార పరీక్షల తరువాతే రైతులు ఎరువులు వాడాలి

by Nallavelli.Anjaneyulu |

రైతులు తమ వ్యవసాయ పొలాల్లో భూసార పరీక్షల ఫలితాల తరువాతే ఎరువులను వాడాలని కొల్లాపూర్ డివిజన్ వ్యవసాయ శాఖ అధికారి చిన్న హుస్సేన్ యాదవ్ అన్నారు.

భూసార పరీక్షల తరువాతే రైతులు ఎరువులు వాడాలి
X

దిశ, కొల్లాపూర్ : రైతులు తమ వ్యవసాయ పొలాల్లో భూసార పరీక్షల ఫలితాల తరువాతే ఎరువులను వాడాలని కొల్లాపూర్ డివిజన్ వ్యవసాయ శాఖ అధికారి చిన్న హుస్సేన్ యాదవ్ అన్నారు. శుక్రవారం మండలంలోని అమరగిరి గ్రామంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. రైతులకు భూసారా పరీక్ష ఫలితాల అదారంగా ఎరువులను ఎలా సమతుల్యంగా వినియోగించాలో ఆయన వివరించారు. విచ్చల విడిగా ఇష్టం వచ్చినట్లుగా, రసాయన ఎరువులు వాడకుండా భూసారా పరీక్ష ఫలితాల ఆధారంగానే రైతులు ఎరువులు వేసుకోవాలనీ ఆయన చెప్పారు. పంటకు కావాల్సిన‌ మోతాదు కంటే అధిక మొత్తం లో ఎరువులు వేసినట్లుయితే సూక్ష్మదాతు లోపాలు అధికమవుతాయి. భూసారా పరీక్షల వల్ల ఏ పోషకాలు ఎంత మోతాదులో వేయాలో తెలుస్తుందనీ ఆమె స్పష్టం చేశారు. రైతులకు భూసారా పరీక్షలు ఎలా చేయాలో డెమో ద్వారా అవగాహన ఆయన కల్పించారు. ఈ అవగాహన కార్య‌క్ర‌మంలో ఏఈఓ మౌనిక, రైతులు పాల్గొన్నారు.

Next Story