- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధాన మంత్రి ధన్-ధాన్య కృషి యోజన పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి : ఎంపీ డీకే అరుణ
దిశ, నారాయణ పేట ప్రతినిధి : ప్రధాన మంత్రి ధన్-ధాన్య కృషి యోజన పథకాన్ని జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ డీ. కె. అరుణ పేర్కొన్నారు. పీ. ఎం. ధన్-ధాన్య కృషి

దిశ, నారాయణ పేట ప్రతినిధి : ప్రధాన మంత్రి ధన్-ధాన్య కృషి యోజన పథకాన్ని జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ డీ. కె. అరుణ పేర్కొన్నారు. పీ. ఎం. ధన్-ధాన్య కృషి యోజన పథకం, పప్పు ధాన్యాల మిషన్ ను భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ ద్వారా పేట మండలం జాజాపూర్ గ్రామంలోని రైతు వేదికలో ఎంపీ డీకే అరుణ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. పీఎం ధన్-ధాన్య కృషి యోజన పథకం ఎంతో గొప్ప కార్యక్రమం అని, దేశంలోని 100 జిల్లాలను ఎంచుకోగా అందులో నారాయణపేట జిల్లా ఈ పథకం కింద ఎంపిక కావడం ఈ ప్రాంత అభివృద్ధికి శుభ పరిణామం అన్నారు. ఈ ప్రాంత రైతులు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షతో ప్రవేశ పెట్టిన ఈ పథకం ఆరేళ్ల పాటు కొనసాగుతుందని, ఈ పథకం కింద ప్రతి ఏటా రూ. 960 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఆమె తెలిపారు. జిల్లాలో వ్యవసాయ రంగ అభివృద్ధికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడం ద్వారా బడ్జెట్ విడుదల అవుతుందన్నారు. జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తుల రైతు సంఘాలను ఏర్పాటు చేసుకుంటే సబ్సిడీ రుణాలు వస్తాయన్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ...ప్రధాన మంత్రి ధన్-ధాన్య కృషి యోజన పథకం కింద మన నారాయణ పేట ఎంపిక కావడం ఈ ప్రాంత అభివృద్ధికి నాంది అన్నారు. జిల్లాలో రాబోయే ఆరేండ్లలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. 2021 లో మన జిల్లాలోని నర్వ మండలం ఆ బ్లాక్ కింద ఎంపిక అయిందని, నీతి అయోగ్ ద్వారా రూ.2 కోట్ల నిధులు వచ్చాయని ఆమె తెలిపారు. జిల్లాలో ప్రధాన మంత్రి ధన్-ధాన్య కృషి యోజన పథకానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ను తయారు చేస్తామన్నారు.






