- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులు దళారులను నమ్మి మోసపోకూడదు : జిల్లా పర్యాటకశాఖ అధికారి నరసింహ
దిశ, వీపనగండ్ల : రైతులు దళారులను నమ్మి మోసపోకూడదనే ఉద్దేశంతో పండించిన పంటకు మద్దతు ధర అందిస్తూ గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు జిల్లా పర్యాటక శాఖ అధికారి నరసింహ

దిశ, వీపనగండ్ల : రైతులు దళారులను నమ్మి మోసపోకూడదనే ఉద్దేశంతో పండించిన పంటకు మద్దతు ధర అందిస్తూ గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు జిల్లా పర్యాటక శాఖ అధికారి నరసింహ తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని గోపాల్దిన్నె,కల్వరాల, వల్లభాపురం, సంగినేనిపల్లి, సంపత్ రావు పల్లి, కొర్లకుంట గ్రామాలలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాలను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారి నరసింహ మాట్లాడుతూ ప్రజాపాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని,రైతులు పండించిన పంటలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోదల బీరయ్య, కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు రావుల నారాయణరెడ్డి సుదర్శన్ రెడ్డి, ఏపీఎం మద్దిలేటి, విండో మాజీ అధ్యక్షులు బాల్ రెడ్డి, నాయకులు, బొల్లారం సుదర్శన్ రెడ్డి, చిన్నారెడ్డి, రఘునాథ్ రెడ్డి, గోపాల్ నాయక్,చక్ర వెంకటేష్, వెంకట్ రాజయ్య, వ్యవసాయ విస్తరణ అధికారుల విజయ్, మోహన్, మహిళా సమైక్య సభ్యులు పాల్గొన్నారు.






