- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులు లాభదాయక పంటలను పండించాలి : మంత్రి వాకిటి శ్రీహరి
దిశ, మక్తల్ : రైతులు లాభదాయక పంటలను పండించడం వల్ల ఆర్థికంగా లాభం లేదని నూనె ఉత్పత్తుల పంటలను పండించడం వల్ల రైతులు ఆర్థికంగా

దిశ, మక్తల్ : రైతులు లాభదాయక పంటలను పండించడం వల్ల ఆర్థికంగా లాభం లేదని నూనె ఉత్పత్తుల పంటలను పండించడం వల్ల రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటాడని రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల యువజన సర్వీసుల మత్సశాఖ మంత్రి వాకిటి అన్నారు. బుధవారం మక్తల్ పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారి మిథున్ చక్రవర్తి ఆధ్వర్యంలో రైతులకు 60 క్వింటాళ్ల ఉచిత వేరు శనగ విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతంలో భూగర్భం రిజర్యాయర్ల వల్ల నీటివనరులు పెరగడంతో రైతులు లాభాల పంటలను పండించాలని సూచించారు. రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉచితంగా వేరుశనగ విత్తనాలను అందించి పంట్ల పండేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
రైతులు బాగుపడాలని కాంగ్రెస్ ప్రభుత్వం వాదన అని.. రైతులకు ఏ కష్టం వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని.. రైతులు పండించిన పంటలు మద్దతు ధర ఇచ్చి సన్న వడ్లకు ప్రోత్సహించేందుకు క్వింటాల్ కి 5 వందల బోనస్ నేరుగా రైతు ఖాతాలకే జమ చేస్తున్నామన్నారు. త్వరలో పత్తి, వరి, కోనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని తెలిపారు. గత సంవత్సరం బోనస్ రాలేదని కొంత మంది రైతులు అంటున్నారని ఇచ్చిన వివరాల ప్రకారం.. వారి ఖాతాకు బోనస్ అందలేదన్నారు. సరైన పత్రాలను రైతులు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ వివరాలతో కూడిన అన్ని వివరాలను వ్యవసాయ శాఖ అధికారులకు అందిస్తే.. త్వరలో బోనస్ నగదును రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు. తహశీల్దార్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ సంచిత్ గాగ్వార్, ఆర్డీవో రామ చంద్రునాయక్, స్థానిక తహశీల్దార్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో 234 కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను మత్య్సశాఖ మంత్రి వాకిటి శ్రీహరి పంపిణీ చేశారు.






