వారం రోజులుగా రెండు మూడు గంటలే విద్యుత్ సరఫరా.. లబోదిబోమంటున్న రైతన్నలు

by I. Sairam |

వారం రోజులుగా రెండు మూడు గంటలే విద్యుత్ సరఫరా చేయడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు.

వారం రోజులుగా రెండు మూడు గంటలే విద్యుత్ సరఫరా.. లబోదిబోమంటున్న రైతన్నలు
X

దిశ, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలం, గంగారం సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న ఫీడర్ వసురంతండా, పెద్ద తండా, కిమ్యాతాండ పంచాయతీలకు కరెంటు సరఫరా రోజుకు ఒకటి రెండు గంటలు విద్యుత్ ఇవ్వడంతో ఆయా గ్రామాల రైతులు సాగు చేసుకున్న వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయని విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించిన పట్టించుకోకపోవడంతో నోటి కాడికి వచ్చిన పంటలు ఎండిపోవడంతో రైతన్నలు లబోదిబోమని అంటున్నారు. ఇప్పటికే విద్యుత్ అధికారులకు ఎన్నోసార్లు విన్నవించిన గత మూడు వారాలుగా నాణ్యమైన కరెంటు లేకపోవడంతో పంట పొలాలకు నీరు పారకపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయి. దీంతో అధికారులు స్పందించడం లేదని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిజినేపల్లి విద్యుత్ ఏఈ ని ఇట్టి విషయంపై వివరణ అడుగగా నేటితో ఇట్టి గ్రామాల రైతులకు ఎలాంటి విద్యుత్ సమస్య ఉండదని తెలిపారు. ఇప్పటికైనా జిల్లా విద్యుత్ అధికారులు స్పందించి ఆయా గ్రామాలకు నాణ్యమైన విద్యుత్తును అందించాలని చేతులెత్తి కోరుతున్నారు.

Next Story