రైతులు తప్పకుండా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి : వ్య‌వ‌సాయశాఖ అధికారి

by Ratna Kumari |

రైతులు తప్పకుండా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారీ కొర్ర రమేష్ నాయక్ తెలిపారు.

రైతులు తప్పకుండా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి :  వ్య‌వ‌సాయశాఖ అధికారి
X

దిశ‌, ఉప్పునుంత‌ల : రైతులు తప్పకుండా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారీ కొర్ర రమేష్ నాయక్ తెలిపారు. ఉప్పునుంతల మండలంలోని దేవదారి కుంట తండాలో గ్రామ సర్పంచ్ మునావత్ మంగమ్మ రతన్ సింగ్ అధ్యక్షతన వ్యవసాయ విస్తరణ అధికారి మంజుల ఆధ్వర్యంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఇది చేసుకోవడం వల్ల ఆధార్ తరహా కార్డు ద్వారా రైతులకు రైతు నమోదు సంఖ్య అందిస్తారని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయాల‌నే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ చేపట్టిందని వారు తెలిపారు. దీంతో రైతుల డిజిటల్ డేటా బేస్, ఫార్మర్ రిజిస్ట్రేషన్ ద్వారా రైతుల ఆధార్ నెంబర్, పట్టాదారు పాస్ బుక్ నంబర్ ఇతర పూర్తి వివరాలు పొందుపరిచి రైతులకు కేంద్రం ద్వారా వచ్చే పథకాలను అందించనున్నట్లు తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు లేనివారికి పథకాలు వర్తిచవని వారు తెలిపారు. ఇప్పటివరకు కూడా చేసుకొని రైతులు సంబంధిత ఏఈఓ లేదా మీసేవ కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మంగమ్మ చంద్రు, వార్డ్ మెంబర్లు, రైతులు పాల్గొన్నారు.

Next Story