- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మామిడి చెట్లకు కళ్యాణం.. ఈ విచిత్ర సంఘటన ఎక్కడంటే..?
దిశ, కొల్లాపూర్ : సాధారణంగా మనుషులకు పెళ్లి జరిపిస్తుంటారు ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ చెట్లకు కూడా పెళ్లి జరిపించారు. ఇది వినడానికి కాస్త

దిశ, కొల్లాపూర్ : సాధారణంగా మనుషులకు పెళ్లి జరిపిస్తుంటారు ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ చెట్లకు కూడా పెళ్లి జరిపించారు. ఇది వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం అండి. అది ఎక్కడో కాదు. నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెళ్లి మండలం మంచాల కట్ట గ్రామంలో విచిత్రంగా రెండు చెట్లకు పెళ్లి చేశారు. ఆ గ్రామ మాజీ సర్పంచ్, రైతు విజయ్ ప్రకృతి సమతుల్యత, పాడిపంటలు పండాలని ఆశిస్తూ తన వ్యవసాయ పొలంలోని ఐదు ఎకరాల్లో ఉన్న మామిడి చెట్లకు మనుషుల మాదిరిగా కళ్యాణం జరిపించారు. ఈ పెళ్లిలో మామిడిచెట్లకు నూతన పట్టు వస్త్రాలతో, బాసింగాలతో అలంకరణ చేయించి పెళ్లిను శాస్త్రోక్తంగా జరిపించారు. మామిడి చెట్ల కళ్యాణ మహోత్సవం సందర్భంగా తోటలో యజమాని విజయ్ ఏర్పాటు చేసిన విందు సదరు రైతు కుటుంబ సభ్యులు, మంచాల కట్ట గ్రామస్తులు, పెంట్లవెల్లి మండల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోవు రాజు, నాయకులు శేషు పాల్గొన్నారు.






