కరెంట్ షాక్ తో రైతు మృతి

by Elthuri vijay kumar |

మహమ్మదాపూర్ గ్రామానికి చెందిన సంఘనమోని రాములు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

కరెంట్ షాక్ తో రైతు మృతి
X

కరెంట్ షాక్ తో రైతు మృతి

- కాలువలో జనుము చెత్త తొలగిస్తుండగా ఘటన

దిశ, పాన్ గల్ : మండల పరిధిలోని మహమ్మదాపూర్ గ్రామానికి చెందిన సంఘనమోని రాములు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. రైతు తన వ్యవసాయ పొలం సమీపంలోని బీమా కాలువలో జనుము చెత్తను తొలగించేందుకు వెళ్లి కాలువలో ఉన్న మోటార్ వద్ద విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు వారు తెలిపారు. మృతుడికి భార్య బిచ్చమ్మ, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. పెద్ద దిక్కును కోల్పోవడంతో రోడ్డున పడిన నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. కాగా మృతుడి కుటుంబాన్ని తాజా మాజీ సర్పంచ్ జయరాములు సాగర్ పరామర్శించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Next Story