- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు మానుకోవాలి : దేవరకద్ర ఎమ్మెల్యే
పాలమూరు ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మంత్రులకు లేదని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు.

దిశ, దేవరకద్ర : పాలమూరు ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మంత్రులకు లేదని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం శ్రీశైల మల్లన్నను కుటుంబ సభ్యులతో దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ అక్కడి నుండే వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ,మంత్రుల పరిస్థితి చూస్తుంటే జాలి వేస్తుంది అన్నారు. ఎందుకంటే వాళ్లు అధికారంలో ఉన్న 2014 నుంచి 2023 వరకు పాలమూరు జిల్లాకు సంబంధించి ఇరిగేషన్ హెల్త్, విద్య మొదలగు శాఖలకు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆ శాఖ అధికారులను ఏనాడు అడిగిన పాపాన పోలేదన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి దగ్గరకు పోయి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని అదేవిధంగా జురాల, కోయిల్ సాగర్, శంకర సముద్రం, బీమా పేజ్ వన్ ,ఫేజ్ టు, కె ఎల్ ఐ ప్రాజెక్ట్ ల కు సంబంధించి పెండింగ్ పనులను పూర్తి చేయాలని అడిగిన పాపాన పోలేదు. మీరు అధికారంలో ఉన్నన్ని రోజులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోచుకోవడానికే సమయం సరిపోలేదు అన్నారు. మేము అభివృద్ధి చేస్తుంటే విమర్శ చేయడం తగదన్నారు.
చిత్తశుద్ధితో పని చేస్తున్నాం
ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాకు చేస్తున్న అభివృద్ధి గురించి ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల పనులను పూర్తి చేయాలని ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును రివ్యూ చేయడం జరిగిందన్నారు. జూన్ కల్లా కర్వేన వరకు నీళ్లు తీసుకువచ్చే బాధ్యత మాది, కోయిల్ సాగర్ జూరాల, నెట్టెంపాడు, శంకర సముద్రం, కే ఎల్ ఐ, ప్రాజెక్టుల పెండింగ్ పనులు పూర్తి చేసి రైతులకు అందిస్తాం. విహారయాత్రలు చేసుకుంటూ మమ్మల్ని విమర్శించే హక్కు మీకు లేదన్నారు. మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం మీరు చేయలేదు మేము అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక మాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాకు చేస్తున్న అభివృద్ధికి మీరు కూడా సహకరిస్తే మిమ్మల్ని కూడా భాగస్వాములు గా స్వీకరిస్తాం. అంతేకానీ అబద్ధ ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. మీకు మీ పార్టీకి భవిష్యత్తు లేదు అప్పటి ముఖ్యమంత్రి కాళేశ్వరాన్ని పూర్తిచేస్తే ముఖ్య మంత్రిని అడిగి మీరు పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయిన మీకు మమ్మల్ని విమర్శించే హక్కు లేదని డిమాండ్ చేశారు. ఈరోజే జూరాల నుంచి కోయిల్ సాగర్ కు నీటిని విడుదల చేశామని ఎప్పటికప్పుడు రైతులకు జవాబు దారితనంగా ఉంటూ ఈ కరువు కాలంలో రైతులకు నీళ్లు ఎలా అందించాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం రైతులకు ఎలాంటి అన్యాయం జరగనివ్వమని హామీ ఇచ్చారు.






