- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తప్పుడు ఆరోపణలు మానుకోవాలి : మంగదొడ్డి సురేఖ రాము యాదవ్
తనపై, తన భర్త కాంగ్రెస్ మండల నాయకులు రాము యాదవ్ పై వస్తున్న తప్పుడు ఆరోపణలు మానుకోవాలని మంగదొడ్డి సురేఖ రాము యాదవ్ తెలిపారు

దిశ, పాన్ గల్ : తనపై, తన భర్త కాంగ్రెస్ మండల నాయకులు రాము యాదవ్ పై వస్తున్న తప్పుడు ఆరోపణలు మానుకోవాలని మంగదొడ్డి సురేఖ తెలిపారు. బుధవారం ఆమె స్వగృహంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తన కూతురు అనారోగ్యం కారణంగానే మండల మహిళా సమాఖ్య అధ్యక్ష పదవికీ రాజీనామా చేసినట్టు తెలిపారు. కొంతమంది తనపై, తన భర్త పై అసత్య ఆరోపణలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని, రాజకీయంగా ఎదుర్కోలేక తన భర్త ఎదుగుదలను ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, యువ నాయకులు జూపల్లి అరుణ్ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కొనసాగుతున్నామని ఆమె అన్నారు.
మండల మాజీ ప్రజా ప్రతినిధి మేము పార్టీ మారుతున్నామని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రి జూపల్లి యువ నాయకులు జూపల్లి అరుణ్ నాయకత్వంలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. మండలానికి చెందిన BRS పార్టీ మాజీ ప్రజాప్రతినిధి కాంగ్రెస్ పార్టీలోకి చేరెందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అందులో భాగంగానే తమను ఇతర పార్టీలోకి వెళ్తున్నామని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న మండల మాజీ ప్రజా ప్రతినిధి తన సొంత గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ నిలబెట్టేందుకు ఒక్కరు కూడా లేకపోవడంతో కాంగ్రెస్ రెబల్ గా ఉన్న వ్యక్తికి మద్దతు తెలిపారంటే ఆయన పరిస్థితి పార్టీలో ఎలా ఉందో తెలుసుకోవాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ ప్రజాప్రతినిధి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కలిసి పని చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటికైనా తప్పుడు ఆరోపణలు మానుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా ఇలాగే ఆరోపణలు చేశారని.. మరోమారు తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో మహిళా నాయకులు లక్ష్మీ, కోటకారి లక్ష్మీ, మశమ్మ, గున్నమోని లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు






