కంటి చికిత్స శిబిరం విజయవంతం

by Nallavelli.Anjaneyulu |

దిశ, కందనూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఐఓసీ భవనంలోని కంటి వైద్య కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కంటి చికిత్స శిబిరం విజయవంతంగా ముగిసిందని

కంటి చికిత్స శిబిరం విజయవంతం
X

దిశ, కందనూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఐఓసీ భవనంలోని కంటి వైద్య కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కంటి చికిత్స శిబిరం విజయవంతంగా ముగిసిందని నాగర్ కర్నూల్ ఆప్తాలమిక్ అధికారి కొట్ర బాలాజీ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 58 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, అందులో అర్హులైన 13 మందిని క్యాటరాక్ట్ (ముత్య బిందు) శస్త్రచికిత్స కోసం ప్రత్యేక అంబులెన్స్ ద్వారా లయన్ రామ్ రెడ్డి కంటి ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది వై.శ్రీనివాసులు, సుకుమార్ రెడ్డి, నరసింహ, చెన్నకేశవులు, ప్రకాష్ పాల్గొన్నారు.

Next Story