అంగ‌న్ వాడి కేంద్రంలో కాలం చెల్లిన పాలు సరఫరా.!

by Ratna Kumari |

అంగ‌న్ వాడి సెంటర్ నిర్వాహకులు ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. సుమారు మూడు నెలల

అంగ‌న్ వాడి కేంద్రంలో కాలం చెల్లిన పాలు సరఫరా.!
X

దిశ, నాగర్ కర్నూల్ : అంగ‌న్ వాడి సెంటర్ నిర్వాహకులు ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. సుమారు మూడు నెలల క్రితమే కాలం చెల్లిన పాలను గర్భిణీలు, బాలింతలకు అంటగడుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం యాదిరెడ్డి పల్లి గ్రామంలోని అంగన్వాడి సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఓ బాలింతకు ప్రభుత్వం సరఫరా చేసే పాలను కాలం చెల్లినవి గర్భిణీ, బాలింతలకు అంట గట్టడంతో అది తెలియక ఇంటికి తీసుకువెళ్లి పాలు కాచి తాగేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పాలు పూర్తిగా పగిలిపోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు కాలం చెల్లినవిగా గుర్తించారు. ఇదేంటని అంగన్వాడీ టీచర్ ని ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చినట్లు ఆ బాలింత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై డీడ‌బ్ల్యూఓ రాజేశ్వరిని ఫోన్ లో సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.


Next Story