- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైడ్రాలిక్ లిఫ్ట్ తో పోలీస్ వాహనాల మరమ్మత్తులు వేగవంతం
'హైడ్రాలిక్ లిఫ్ట్ స్థాపనతో పోలీస్ మోటారు వాహనాల మరమ్మత్తుల నిర్వాహణ ఇకపై సులభంగా, వేగవంతంతో చేసేందుకు వీలవుతుందని ఎస్పీ జానకి అన్నారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : 'హైడ్రాలిక్ లిఫ్ట్ స్థాపనతో పోలీస్ మోటారు వాహనాల మరమ్మత్తుల నిర్వాహణ ఇకపై సులభంగా, వేగవంతంతో చేసేందుకు వీలవుతుందని ఎస్పీ జానకి అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని మోటార్ ట్రాన్స్ పోర్ట్ పూల్ నందు హైడ్రాలిక్ లిఫ్ట్ స్థాపన కోసం షెడ్డు నిర్మాణానికి శుక్రవారం ఆమె భూమిపూజ చేసి మీడియాతో మాట్లాడారు. పోలీస్ శాఖలో వాహనాల నిర్వాహణ అత్యంత కీలకమని, ఈ హైడ్రాలిక్ లిఫ్ట్ ఏర్పాటు ద్వారా వాహనాలకు ఆయిల్ మార్పిడి, వాషింగ్, మేజర్, మైనర్ మరమ్మతులు సులభంగా వేగవంతంతో చేయడానికి వీలవుతుందని ఆమె అన్నారు. అంతేకాక ఫీల్డ్ డ్యూటీ లకు వాహనాలు ఎప్పటికప్పుడు సిద్దంగా ఉండేలా చేయవచ్చన్నారు. పోలీస్ శాఖలో అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా సేవలను మరింత మెరుగుపరచడం సాధ్యమవుతుందని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎన్బీ రత్నం, సురేష్ కుమార్, డిఎస్పీ లు రమణారెడ్డి, బాలాజీ, ఎంటిఓ నగేష్, ఆర్ఐ అడ్మిన్ కృష్ణయ్య, అశోక్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.






