ఆశించిన స్థాయిలో వసూలు కానీ ఆస్తి పన్ను : మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ రామానుజుల రెడ్డి

by Ratna Kumari |

మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేష‌న్ పరిధిలో ఆశించిన స్థాయిలో ఆస్తి పన్ను వసూలు కాలేదని మున్సిపల్ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ రామానుజుల రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆశించిన స్థాయిలో వసూలు కానీ ఆస్తి పన్ను :  మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ రామానుజుల రెడ్డి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేష‌న్ పరిధిలో ఆశించిన స్థాయిలో ఆస్తి పన్ను వసూలు కాలేదని మున్సిపల్ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ రామానుజుల రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని ఆయన తన ఛాంబర్ లో 'దిశ' తో మాట్లాడుతూ.. వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలనే లక్ష్యంతో 6 టీమ్ లను ఏర్పాటు చేసి దాదాపు 70 మంది సిబ్బందిని నియమించినా పూర్తిగా 50 శాతం పన్నును వసూలు చేయలేకపోయామని ఆయన పెదవి విరిచారు. గత ఆర్ధిక సంవత్సరంలో రూ.53 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉండగా.. 22,23,16,040 రూపాయలు, నీటి రుసుము 2,56,16,259 రూపాయలు, ట్రేడ్ లైసెన్సు, మ్యూటివేషన్, తదితర ఫీజ్ లు మొత్తం 1,14,30,454 రూపాయలు వసూలు అయ్యాయని ఆయన వివరించారు. ఈ ఆర్ధిక సంవత్సరం ఆస్తి పన్ను 2026 ఏప్రిల్ 31 లోపు చెల్లించే వారికి 5 శాతం రాయితీ వర్తిస్తుందని, పన్నుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Next Story