- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోండి : ఎస్పీ జానకి
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఎస్పీ జానకి సూచించారు. గ్రామ పంచాయతీ

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఎస్పీ జానకి సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా శనివారం ఆమె జిల్లాలోని భూత్పూర్ మండలంలోని పోతులమడుగు, అన్నాసాగర్, తాటికొండ గ్రామాల ప్రజలతో సమావేశమై శాంతి భద్రతలు, చట్టపరమైన నియమాలు, పౌరుల బాధ్యతలపై అవగాహన కల్పిస్తూ, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, ప్రచార కార్యకర్తలు, యువత, గ్రామ ప్రజలు, మహిళలు తప్పనిసరిగా పాటించాల్సిన పలు సూచనలు చేశారు. మద్యం, డబ్బు, కానుకలు లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదని, అభ్యర్థుల మధ్య వాగ్వివాదాలు, గుంపులుగా తిరగడం, సోషల్ మీడియాలో పుకార్లు, రెచ్చగొట్టే పోస్టులు లాంటివి చట్టపరమైన నేరాలని ఆమె హెచ్చరించారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక పహారా బృందాలు,షీ టీమ్స్ సేవలు సిద్ధంగా ఉన్నాయని, ఏవైనా వేధింపులు, ఇబ్బందులు జరిగినా వెంటనే ఫిర్యాదులు చేయాలని ఆమె సూచించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు, బైండోవర్ లు, అభ్యర్థిత్వం రద్దు వంటి కఠిన చర్యలు తప్పవని ఎస్పీ జానకి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భూత్పూర్ సీఐ రామకృష్ణ, ఎస్ఐ చంద్రశేఖర్, ఎంపిడివో, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






