అమరచింత మున్సిపాలిటీలో ఉత్కంఠ

by Nallavelli.Anjaneyulu |

వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది.

అమరచింత మున్సిపాలిటీలో ఉత్కంఠ
X

దిశ, అమరచింత : వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. ప్రధాన పార్టీలైన‌ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులకు మున్సిపల్ ఎన్నికల్లో సమాన సీట్లు రావడంతో హంగ్ ఏర్పడిన విషయం తెలిసిందే. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించి 10 వార్డులకు బీజేపీ మూడు వార్డులు, బీఆర్ఎస్ మూడు వార్డులు కైవసం చేసుకున్నాయి. మిగతా 4 వార్డుల్లో కాంగ్రెస్, సీపీఎం కూటమి కాంగ్రెస్ 3 వార్డులు, సీపీఎం ఒక్క వార్డు కైవసం చేసుకున్నాయి. ఈ క్రమంలో బీజేపీ,బీఆర్ఎస్ పార్టీలు ఏకమై మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠం దక్కించుకుంటారని అంత అనుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలించాయని తెలిసింది. హైదరాబాద్ క్యాంపులో ఉన్న బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు ఇవాళ‌ మధ్యాహ్నం జంప్ అయినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. విప్ జారీ చేసే సమయం ముగియడంతో కౌన్సిలర్లు క్యాంపు నుంచి జారుకున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ కూటమి 4 సీట్లు, బీఆర్ ఎస్ 2 సీట్లతో కలిపి అమరచింత మున్సిపల్ పీఠాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ దక్కించుకోనుంది.

Next Story