- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాటు సారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు
గ్రామాలలో నాటు సారా తయారు చేసి విక్రయిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.

X
దిశ, వంగూర్ : గ్రామాలలో నాటు సారా తయారు చేసి విక్రయిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని సర్వారెడ్డి పల్లి తాండ గ్రామంలో మంగళవారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 250 లీటర్ల బెల్లం పాకం, 6 లీటర్ల సారాయి, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీన పరుచుకొని వ్యక్తి పై కేసు నమోదు చేశారు. అనంతరం ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎవరైనా సారా తయారీకి బెల్లం, పట్టిక విక్రయిస్తే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ నాగరాజు, కానిస్టేబుల్స్ మునిందర్, జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.
Next Story






