- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాటు సారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు
మండలంలో నాటు సారా తయారు చేసి విక్రయిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎక్సైజ్ ఎస్ఐ జె. వివేక్ అన్నారు..

X
దిశ, చారకొండ : మండలంలో నాటు సారా తయారు చేసి విక్రయిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎక్సైజ్ ఎస్ఐ జె. వివేక్ అన్నారు. కల్వకుర్తి ఎక్సైజ్ సీఐ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై వివేక్ శనివారం చారకొండ మండల కేంద్రం లో సారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వివేక్ మాట్లాడుతూ చారకొండలో నిర్వహించిన దాడుల్లో 300 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి ఒకరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. శిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని కిరాణం షాపులో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. ఎవరైనా సార తయారీకి బెల్లం, పటిక విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సై శ్రావణి, కానిస్టేబుల్ మహేష్ నర్య, భీమమ్మ పాల్గొన్నారు.
Next Story






