గట్టులో మరోచోట గుప్త నిధుల తవ్వకాలు..

by Kodari Anjali |

భారీ మొత్తంలో నిధి దొరికినట్టు మండల కేంద్రంలో పుకార్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

గట్టులో మరోచోట గుప్త నిధుల తవ్వకాలు..
X

దిశ, గట్టు: అక్కడ భారీ మొత్తంలో నిధి దొరికినట్టు మండల కేంద్రంలో పుకార్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన గట్టు మండల కేంద్రంలో మరోసారి గుప్తనిధుల కళకలం గుప్పుమంటుంది. మొన్న ఒక పాత ఇంట్లో గోడ నిర్మాణం సమయంలో కూలీలకు వెండి, బంగారు నాణాలు దొరికిన సంఘటన మరవకముందు మరోచోట గ్రామంలో తవ్వకాలు జరిగినట్లు గ్రామస్తులు పుకార్లు షికార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అని తెలుపుతున్నారు. కాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. గట్టు మండల కేంద్రంలో బిచ్చలపేట దగ్గరున్న పెద్దపూల మసీదు దగ్గర పది, పదైదు రోజుల క్రితం తవ్వకాలు జరిపినట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు.

మసీదు దగ్గర తవ్వకాలు జరిపిన వారిపై..

కాగా అక్కడ తవ్వకాల్లో భారీ మొత్తంలో గుప్తనిధులు దొరికినట్లు గ్రామంలో పుకారు నడుస్తుంది. అక్కడ తవ్వకాలు జరిపిన వ్యవహారంలో పెద్ద పెద్ద తలలు ఉన్నందున బయటకు రానివ్వడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే ఇదంతా ఒకరిపై మరొకరికి పడక బయటకు చెబుతున్నట్లు తెలుస్తున్నప్పటికీ గ్రామస్తుల డిమాండ్ మాత్రం మొన్న గోడ కూలీల విచారణ చేసి రికవరీ చేసినట్లే ఇప్పుడు పెద్దపూల మసీదు దగ్గర తవ్వకాలు జరిపిన వారిపై కూడా ఆధికారులు నిష్పాక్షపాతంగా విచరణ చేసి చర్యలు చేపడితే భారీ మొత్తంలో నిధి బయటపడుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత యాభై సంవత్సరాల కిందట గట్టులీ బంగారు నాణెలు, రాసులు పోశారని రాజధాని హైదరబాద్‌లో సాలార్ జంగ్ మ్యూజియంలో గట్టు బంగారు నాణెలు ఉంచినట్టు గట్టు గ్రామ పెద్దలు చర్చించుకుంటున్నారు. ఏదిఏమైన అధికారులు సక్రమంగా విచారణ చేపడితే గుప్తనిధులు గట్టు బంగారం అధిక మెత్తంలో లభ్యం అవుతుందని గట్టు మండల ప్రజలు చర్చించుకుంటున్నారు

Next Story