ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలి : ఈకో క్లబ్ కన్వీనర్ డాక్టర్ ఎస్ కరుణాకర్ రెడ్డి

by Ratna Kumari |

ప్లాస్టిక్ ర‌హిత స‌మాజ నిర్మాణానికి అంద‌రూ కృషి చేయాల‌ని ఈకో క్ల‌బ్ క‌న్వీన‌ర్ డాక్ట‌ర్ ఎస్. క‌రుణాక‌ర్ రెడ్డి పేర్కొన్నారు.

ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలి : ఈకో క్లబ్ కన్వీనర్ డాక్టర్ ఎస్ కరుణాకర్ రెడ్డి
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : ప్లాస్టిక్ ర‌హిత స‌మాజ నిర్మాణానికి అంద‌రూ కృషి చేయాల‌ని ఈకో క్ల‌బ్ క‌న్వీన‌ర్ డాక్ట‌ర్ ఎస్. క‌రుణాక‌ర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో అమలవుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఇవాళ గద్వాల లోని ఎం.ఏ.ఎల్.డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్లాస్టిక్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఈకో క్లబ్ కన్వీనర్ డా. ఎస్. కరుణాకర్ రెడ్డి హాజ‌రై మాట్లాడారు. ముఖ్యంగా క్యారీ బ్యాగులు, డిస్పోజబుల్ కప్పులు, స్ట్రాలు, ప్యాకేజింగ్ సామాగ్రి వంటి ప్లాస్టిక్ వస్తువులు సౌకర్యం కోసం విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయని.. అవి ఒక్కసారి వాడిన తర్వాత పారేయ‌డం వ‌ల్ల తీవ్రమైన కాలుష్యం ఏర్పడుతుందని తెలిపారు. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు పూర్తిగా కరుగుటకు ఎన్నో సంవత్సరాలు ప‌డుతుంద‌ని.. జీవవ్యవస్థ, వన్యప్రాణులు, జల వనరులకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని చెప్పారు.

కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ షేక్ ఖలందర్ బాషా మాట్లాడుతూ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. పర్యావరణానికి మేలు చేసే అలవాట్లు అలవరచుకోవాలని, పరిశుభ్రమైన, స్థిరమైన వాతావరణం కోసం చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన కాలుష్య నియంత్రణ మండలి ఉపాధ్యాయుల కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమానికి కళాశాల ఉపాధ్యాయులు, ఈకో క్లబ్ సభ్యులు డాక్టర్ ఎన్ హరినాథ్, జె వెంకటేశం, డాక్టర్ జి గణేష్, సుబ్రమణ్యం, శంకర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Next Story