- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుష్టు వ్యాధి రహిత సమాజం కొరకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి : జేఎండీ డాక్టర్ సంపత్
దిశ, మద్దూరు : కుష్టు వ్యాధి రహిత సమాజం కొరకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని జేఎండీ డాక్టర్ సంపత్ పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర కుష్టు వ్యాధి నివారణ బృందం మద్దూరు పీహెచ్సీ

దిశ, మద్దూరు : కుష్టు వ్యాధి రహిత సమాజం కొరకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని జేఎండీ డాక్టర్ సంపత్ పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర కుష్టు వ్యాధి నివారణ బృందం మద్దూరు పీహెచ్సీ ని సందర్శించారు. ఈ సందర్భంగా జేఎండీ డాక్టర్ సంపత్ మద్దూరు పీహెచ్సీ వైద్య సిబ్బంది, ఏఎన్ఎం, ఆశావర్కర్లకు కుష్టు వ్యాధి నివారణ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి ఎంటీడీ డ్రగ్స్, మాత్రలను వాడితే పూర్తిగా నిర్మూలించడంతోపాటు.. అంగవైకల్యం రాకుండా నివారించవచ్చు అన్నారు. అలాగే కుష్టు వ్యాధి సర్వే పై వారికి అవగాహన కల్పించారు. కుష్టు వ్యాధి రహిత సమాజం కొరకు వైద్య సిబ్బందితోపాటు సమాజంలోని ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కుష్టు వ్యాధి నివారణ రాష్ట్ర సభ్యులు డిప్యూటీ పీఎమ్ఓలు వెంకటేశ్వర చారి, సకల రెడ్డి, సురేందర్, జిల్లా అధికారులు డిప్యూటీ పీఎంవో శ్రీనివాస్, పీహెచ్ సీ అధికారులు డాక్టర్ శ్రీలత, ప్రేమ్ రాజు, హన్మంత్ పాల్గొన్నారు.






