ప్రతి ఒక్కరూ కేవైసీ చేయించుకోండి

by Nallavelli.Anjaneyulu |

వనపర్తి జిల్లా గోపాల్ పేట‌ మండల కేంద్రంలోని లీడ్ బ్యాంకు మేనేజర్ వనపర్తి ఆధ్వర్యంలో ఆర్బీఐ సహకారంతో వాకతాన్ అనే ప్రోగ్రాం నిర్వహించారు.

ప్రతి ఒక్కరూ కేవైసీ చేయించుకోండి
X

దిశ, గోపాల్ పేట : వనపర్తి జిల్లా గోపాల్ పేట‌ మండల కేంద్రంలోని లీడ్ బ్యాంకు మేనేజర్ వనపర్తి ఆధ్వర్యంలో ఆర్బీఐ సహకారంతో వాకతాన్ అనే ప్రోగ్రాం నిర్వహించారు. ఇందులో భాగంగా బస్టాండ్ కూడలి నుంచి పోలీస్ స్టేషన్ కూడలి వరకు ర్యాలీగా వచ్చి అక్కడ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్డిఓ చేతన్ గోరె మాట్లాడుతూ కేవైసీ చేసుకోవడం వల్ల మనీ లండరింగ్,ఉగ్రవాద ఫైనాన్సింగ్, మోసం వంటి ఆర్థిక నేరాలను నిరోధించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఆర్థిక సంస్థలు, నిజాయితీ గల కస్టమర్లను అక్రమ కార్యకలాపాల నుంచి రక్షించడం, వ్యవస్థ భద్రతను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది అని అన్నారు. కేవైసీకి కావలసిన పత్రాలు ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డు వీటితో కేవైసీ చేయించుకోవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో యూబీఐ, ఆర్ ఓ చంద్రకుమార్, ఎల్ డి ఎం శివ, ఎంపీడీవో ఆయేషా అంజుమ్, ఎంపీఓ భవాని, గ్రామ సర్పంచ్ కర్రోల్ల స్వప్న భాస్కర్, పంచాయతీ కార్యదర్శి బాలరాజు, సీఎఫ్ఎల్ కౌన్సిలర్లు ప్రదీప్ కుమార్, రామకృష్ణ, సరస్వతి పాల్గొన్నారు.

Next Story