'తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వే' లో అందరూ పాల్గొనండి : కలెక్టర్ విజయేందిర బోయి

by Nallavelli.Anjaneyulu |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రూప కల్పన కై ఉద్దేశించిన 'తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వే' కు ప్రజల నుండి విశేష స్పందన

తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వే లో అందరూ పాల్గొనండి : కలెక్టర్ విజయేందిర బోయి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకై ఉద్దేశించిన 'తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వే' కు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఇప్పటివరకు ఈ సిటిజన్ సర్వే లో కేవలం తెలంగాణ నుండే వివిధ ప్రాంతాల పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందజేశారని, భారతదేశ స్వాతంత్య్రానికి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్బంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుండి తగు సలహాలు, సూచనలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేను చేపట్టిందని ఆమె వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం గత వారం ప్రారంభించిన ఈ సర్వే, ఈనెల 25 తో ముగుస్తుందని, ఈ సర్వే రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉన్నందున www.telangana.gov.in/telanganarising అనే వెబ్ సైట్ ను సందర్శించి, ప్రతి ఒక్కరు తమ అమూల్యమైన సలహాలు, సూచనలను అందించాల్సింగా కలెక్టర్ విజయేందిర బోయి విజ్ఞప్తి చేశారు.

మంచినీటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోండి..

మహబూబ్ నగర పాలక సంస్థ పరిధిలోని ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్రాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని విసి కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో ఆమె పట్టణంలో త్రాగునీటి సరఫరాపై సమీక్షించారు. ప్రజలకు త్రాగు నీటి సరఫరా లో ఇబ్బందులు లేకుండా, నీటి సరఫరా పైపు లైన్ లు పగిలిన వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయడం, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, విద్యుత్ సరఫరాలో సమస్యలు లేకుండా ఎస్పీడిసిఎల్ ఎస్ఈ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మున్సిపల్ డిఈ, ఏఈ లు ప్రతి రోజు త్రాగు నీటి సరఫరా పై పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశం లో మిషన్ భగీరథ ఎస్ఈ జగన్మోహన్, ఈఈ(గ్రిడ్) శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎస్పీడిసిఎల్ ఎస్ఈ రమేష్, మున్సిపల్ డిఈ విజయ్ కుమార్ పాల్గొన్నారు.

Next Story