- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి పోలీస్ క్రమశిక్షణతో మెలగాలి :జిల్లా ఎస్పీ
పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు తెలిపారు.

దిశ, గద్వాల ప్రతినిధి : పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు తెలిపారు.జోగుళాంబ గద్వాల్ జిల్లా పోలీస్ కార్యాలయం లో శనివారం సమావేశ హాల్ లో జిల్లా పోలీస్ స్పెషల్ పార్టీ,ఎం టీ సెక్షన్ , ఎస్కార్ట్ ,పి ఎస్ వో లు, బి డి టీమ్స్, డాగ్ స్క్వాడ్,సాయుధ సిబ్బంది తో (దర్బార్ ) సమావేశాన్ని ఆయన నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మట్లాడుతూ..శాంతి భద్రతల పరిరక్షణ లో సాయుధ దళ పోలీస్ పాత్ర కీలకం అని, జిల్లా లో సాయుధ దళ పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులు సంతృప్తికరంగా ఉన్నాయని అన్నారు. సిబ్బంది విధులను చక్కగా నిర్వహించడం తో పాటు ఆరోగ్యం,కుటుంబ సభ్యుల సంక్షేమం పై కూడా దృష్టి పెట్టాలని అన్నారు.శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని, పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ కలిగి ఉండాలన్నారు. భాద్యతగా తమ విధులను నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలందించాలని సూచించారు. పోలీసులు వృత్తి నిర్వహణలో నైపుణ్యాలను పెంచుకోవాలని అన్నారు. విధి నిర్వహణలో ఎదురయ్యే సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి చొరవ తీసుకుంటామని తెలిపారు.నిరంతరం విధులలో ఉండే పోలీసు అధికారులు,సిబ్బందికి వ్యక్తిగత,కుటుంబపరమైన,శాఖాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లపుడూ ముందుంటామని వివరించారు. సిబ్బందికి విధులలో ఎదురయ్యే సమస్యలను అడిగి తెలుసుకొని వారిపై వత్తిడి లేకుండా విధులు నిర్వహించేలా అధికారులకు ఎస్పీ పలు ఆదేశాలు జారీ చేశారు. చిత్తశుద్ధి తో విధులు నిర్వహించి ప్రజలలో పోలీస్ శాఖ కు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచేలా కృషి చెయ్యాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సాయుధ దళ డి.ఎస్పి నరేందర్ రావు, ఆర్ ఐ వెంకటేష్, సాయుధ దళ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






