- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి కార్యకర్త పార్టీకి బ్రాండ్ అంబాసిడరే : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
దిశ, జడ్చర్ల : కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడరేనని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ

దిశ, జడ్చర్ల : కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడరేనని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ సత్తాను చాటాలని, ప్రతీ గ్రామంలోనూ విజయకేతనాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం జడ్చర్ల పట్టణంలోని చంద్ర గార్డెన్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో అనిరుధ్ రెడ్డి మాట్లాడారు.నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకూ తాను అండగా నిలబడతానని.. అలాగే పార్టీ శ్రేణులు కూడా పార్టీని విజయపథంలో నడిపించడంలో తనకు సహకారం అందించాలని కోరారు. కార్యకర్తలు కూడా ప్రజాదరణ చూరగొని.. పార్టీకి విజయాలను అందించడంలో తనకు అండగా నిలవాలని కోరారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ నేతలు అందరూ కలిసి కట్టుగా పని చేయాలని, అందరూ కలిసి సమన్వయంతో పని చేయడం ద్వారా ప్రతీ స్థానంలోనూ పార్టీ అభ్యర్థులు గెలిచేలా చూడాలన్నారు. 22 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో సాధించిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడమే సంఘటన్ సృజన్ అభియాన్ ప్రధాన ఉద్దేశం అన్నారు. నియోజకవర్గంలో విద్యావ్యవస్థ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ నవోదయ విద్యాలయం, త్రిపుల్ ఐటీ కళాశాల, ఇంటిగ్రేటెడ్ పాఠశాల, ఏటీసీ లను మంజూరు చేయించానని విద్యుత్ కొరతను నివారించేందుకు ఇప్పటికే 21 సబ్ స్టేషన్లు మంజూరు చేయించాననీ, గుర్తు చేశారు. బాదేపల్లి పాఠశాల నూరేళ్ల పండుగ సందర్భంగా రాబోయే నవంబర్ 29న జడ్చర్ల కేంద్రంలో సినీ కళాకారులతో మ్యూజికల్ నైట్ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.ఈ మ్యూజికల్ నైట్‌కు సీఎం రేవంత్ రెడ్డి ని ఆహ్వానించనున్నట్టు వెల్లడించారు. జడ్చర్ల ప్రజలకు ఇది ఒక వేడుకలా ఉంటుందని అని అనిరుధ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. స్థానిక చంద్ర గార్డెన్స్ లో శుక్రవారం ఉదయం నిర్వహించిన ఏ- బ్లాక్ సమావేశంలో జడ్చర్ల, మిడ్జిల్, ఉర్కొండ మండలాల నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు స్వీకరించగా, మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన బీ- బ్లాక్ సమావేశంలో బాలానగర్, నవాబ్‌పేట్, రాజపుర్ మండలాల నాయకుల, కార్యకర్తలతో అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ అబ్జర్వర్, కర్ణాటక ఎంఎల్సీ ఎం. నారాయణస్వామి, టిపీసీసీ అబ్జర్వర్ లుగా రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్, జాకీర్ ఉస్మాన్, జిల్లా పార్టీ అధ్యక్షులు దేవరకద్ర శాసనసభ్యులు జి. మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు.






