డాక్ట‌ర్ ఉన్నా.. ప‌ని చేయ‌ని దంతాల‌ మిష‌న్..!

by Nallavelli.Anjaneyulu |

దిశ, బిజినేపల్లి : ఏళ్లు గడిచిన దంతాల మిషన్ పని చేయకపోవడంతో దంత స‌మ‌స్య‌లు ఉన్నవారు తీవ్ర‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దంతాల డాక్టర్ ఉన్నారు.

డాక్ట‌ర్ ఉన్నా.. ప‌ని చేయ‌ని దంతాల‌ మిష‌న్..!
X

దిశ, బిజినేపల్లి : ఏళ్లు గడిచిన దంతాల మిషన్ పని చేయకపోవడంతో దంత స‌మ‌స్య‌లు ఉన్నవారు తీవ్ర‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దంతాల డాక్టర్ ఉన్నారు. కానీ దంతాల మిషన్ పని చేయకపోవడంతో ఏళ్ల తరబడిగా సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గవర్నమెంట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గవర్నమెంట్ సంబంధించిన వైద్యాధికారి ఉన్నా కానీ దంతాల మిషన్ పని చేయకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులు ఆశ్రయించక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో దంతాల వైద్యులు లేకపోయినా కూడా పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దంతాలకు సంబంధించిన డాక్టర్ ఉన్న దంతాలకు సంబంధించిన మిషన్ పని చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని దిశ ప్రతినిధికి విన్నవించారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి పాలెంలో దంతాల మిషన్ పనిచేసే విధంగా కృషి చేయాలని కోరుతున్నారు.

Next Story