- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడు నెలలు దాటినా ముక్క లేదు.. గురుకులాలకు చికెన్ సరఫరా బంద్
విద్యా సంక్షేమం కోసం ఎప్పుడు ముందుంటామని చెప్పుకునే ప్రభుత్వాలు విద్యార్థుల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

దిశ, ధన్వాడ: విద్యా సంక్షేమం కోసం ఎప్పుడు ముందుంటామని చెప్పుకునే ప్రభుత్వాలు విద్యార్థుల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం సర్కార్ బడుల్లో విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, యూనిఫార్మ్స్, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు. అయితే గురుకులాల విషయంలో మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగానే ఉంది. ఎంతోమంది నిరుపేద విద్యార్థులు గురుకులాల్లో ఉండి చదువుకుంటున్నారు. అయితే మండల కేంద్రమైన ధన్వాడ లోని కస్తూర్బా గురుకుల పాఠశాల మోడల్ హాస్టల్‌లో గత మూడు నెలలకు పైగా బాలికలకు చికెన్ అందించడం లేదు. దీంతో బాలికలకు చికెన్ కాకుండా కేవలం గుడ్డుతోనే సరిపెడుతున్నారు. చికెన్ గుడ్ల సరఫరకు సంబంధించిన టెండర్ విషయంలో అధికారులు పట్టించుకోలేదని తెలుస్తుంది.
టెండర్ దారులకు రావలసిన బిల్లులు రాలేనందున చికెన్ సరఫరా బంద్ చేసినట్లు సమాచారం. గురుకులాల్లో ప్రతి ఆదివారం బాలికలకు చికెన్ అందించాలి కానీ దాదాపుగా మూడు నెలలు దాటిన చికెన్ విషయంలో విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. సెలవు దినాల్లో బాలికల తల్లిదండ్రులు తమ పిల్లల యోగక్షేమాలు తెలుసుకోవడానికి గురుకులాలకు రావడం అక్కడ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల భోజనము సంబంధించి ఆరా తీస్తున్నారు. అయితే చికెన్ మాత్రం ఇవ్వడం లేదని బాలికలు తల్లిదండ్రులతో వాపోతున్నారు. విద్యా సంవత్సరం ముగింపుకు దగ్గరలో ఉన్నా చికెన్ సరఫరా విషయంలో ఎవరు స్పందించడం లేదు. జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించాలని బాలికల తల్లిదండ్రులు కోరుతున్నారు.






