- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాజెక్టుల అంచనా పెంచారు.. డిజైన్లు కుదించారు : ఎమ్మెల్సీ కవిత
దిశ, కొల్లాపూర్ : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా భూములకు కృష్ణా జలాలను తరలించేందు కోసం ఉద్దేశించి

దిశ, కొల్లాపూర్ : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా భూములకు కృష్ణా జలాలను తరలించేందు కోసం ఉద్దేశించి నిర్మించిన మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, పాలమూరు -రంగా రెడ్డి ప్రాజెక్టు అంచనా వ్యయాలను పెంచి మొదటి డిజైన్ సైతం కుదించి సాగు నీటి లక్ష్యాన్ని దెబ్బ తీశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా లో జాగృతి జనంబాట లో భాగంగా శనివారం కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలో నిర్మాణం జరిగిన కేఎల్ఐ, పీఆర్ఎల్ పంపు హౌస్ మోటార్ల ను ఆమె పరిశీలించారు. ఆ రెండు సాగు నీటి ప్రాజెక్టుల తీరు తేన్నులను గూర్చి డీఈ లోక్ నాథ్ తో ఆమె వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఈమె కేఎల్ఐ సిస్టర్న్ వద్ద మీడియా తో మాట్లాడారు. సాగు నీరందించేందు ఎల్లూరు పంపు హౌస్ లో అవినీతి, ఏండ్లు గడుస్తున్నా ప్రాజెక్ట్ పూర్తి చేయకపోవడం ప్రభుత్య నిర్లక్ష్యమని కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఎల్లూరు పంపు హౌస్ లో పగుళ్లు, మూడో మోటారు పేలి పోవడం దాని తీవ్రతకు,ఐదో మోటార్ మరమ్మత్తు కు గురై పంపు హౌస్ పూర్తిగా నీట మునగడం, రిపేర్లు సహా ఇతర వివరాలను ప్రాజెక్ట్ ఇంజనీయర్లను అడిగి తెలుసుకున్నారు.
త్వరగా కెఎల్ఐ రెండు మోటార్లను రిపేర్ చేయాలని ఆమె ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. ప్రాజెక్ట్ పనులలో జాప్యంతో రైతులకు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎల్లూరు పంపు హౌస్ లో అవినీతి జరిగిందని ఆమె ఆరోపించారు. ఎంజీకేఎల్ ప్రాజెక్టు లో 500 మీటర్లు కేనాల్,అలాగే 50 మీటర్ల వెడల్పును 20 మీటర్లకు కుదించడం, పొడవును తగ్గించడం,మూలంగా నిర్దేశించిన సాగునీటి లక్ష్యం దెబ్బతిందని కవిత విచారం వ్యక్తం చేశారు. రూ. 3024 కోట్లకు ఉన్న అంచనా వ్యయాన్ని రూ,4600 కోట్లకు పెంచారని ఆమె పేర్కొన్నారు. కానీ ప్రాజెక్టు వ్యయం పెంచిన అందుకు తగ్గగట్టు సాగు నీటి నిర్మాణం జరగకపోవడంతో రైతులకు ఇబ్బందులు ఏర్పడ్డయ్యాన్నారు. ఏడాది పొడవునా కృష్ణా నదిలో 40 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్లు లేవని ఆమె తెలిపారు. పాలమూర్ ప్రాజెక్టులో 6.5 టీఎంసీల నీటి నిల్వ తో రూపందించిన మొదటి నార్లాపూర్ రిజర్వాయర్ ను 4 టీఎంసీల కే కేటాయించి, 2 టీఎంసీ ల నీటిని తగ్గించారని ఆమె ఆరోపించారు.పాలమూరు ప్రాజెక్టు మొదట రూ,740 కోట్ల కు అంచనా వ్యయంతో డిజైన్ రూపొందించి తీరా దాన్ని వ్యయాన్ని రూ, 960,కోట్లకు పెంచారని ఆమె పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం ఎంజీకేఎల్ ప్రాజెక్టులోని పంపుహౌస్ లోని మోటార్ల మరమ్మతులను చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ కింద కాలనీలను ఇప్పటి వరకు నిర్మించకపోవడం పట్ల ఆమె అసహనం వ్యక్తం చేశారు. ప్రజాధనం వృధాకాకుండా ప్రభుత్వం చూడాలని ఆమె కోరారు. అనంతరం తిరుగు ప్రయాణంలో ఎల్లురు చెంచుగూడెం ఆదివాసీలతో కవిత మాట్లాడుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్బంగా ఆమె ఆదివాసీలకు బిస్కెట్ ప్యాకెట్లు పంచారు. ఆ తరువాత కొల్లాపూర్ పట్టణంలోని ఎరుకలి వీధిలో పర్యటించారు. కుల వృత్తి, స్థితిగతులు గురించి అడిగి తెలుసుకున్నారు. ఎరుకలి సోది చెప్పి, వారి భాష, వారి సమస్యలను ఆడిగితెలుసుకున్నారు.






