- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎర్రవల్లి, తాండాలను ముంపునకు గురికాకుండా కాపాడాలి : గోకారం రిజర్వాయర్ బాధితులు
దిశ, చారకొండ : ఎర్రవల్లి-గోకారం రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించి ఎర్రవల్లి, తాండాలను ముంపునకు గురికాకుండా కాపాడాలని బాధితులు బుధవారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కి వినతి

దిశ, చారకొండ : ఎర్రవల్లి-గోకారం రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించి ఎర్రవల్లి, తాండాలను ముంపునకు గురికాకుండా కాపాడాలని బాధితులు బుధవారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎర్రవల్లి గోకారం భూ నిర్వాసితుల సంఘం సభ్యులు మాట్లాడుతూ.. తాండ, గ్రామ వాసుల ఆధ్వర్యంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ గురించి కల్వకుర్తి ఆర్డీవో కార్యాలయంలో, నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్ చర్చించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం అసమర్థ పాలన, ఇంజనీర్ల నిర్లక్ష్యం వల్ల తప్పుడు సర్వేలు చేసి ఎర్రబెల్లి గ్రామాన్ని తాండాని ముంపునకు గురి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ముమ్మాటికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీని ఒప్పుకునే ప్రసక్తి లేదని, తమ భూములను గ్రామాన్ని వదులుకోలేమనీ తేల్చి చెప్పామన్నారు. అదనపు కలెక్టర్ సానుకూలంగా స్పందించి మానవత దృక్పథంతో ఉన్నతాధికారులకు నివేదికను అందజేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల క్రితం ఒక ఎకరాకి ఐదున్నర లక్షలు మాత్రమే చెల్లించి రైతులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ ఏర్పడ్డాక సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయానికి వినతిపత్రం అందజేశామని, రీ సర్వే చేస్తామని కార్యాలయం నుంచి సమాచారం అందిందన్నారు. గ్రామ, తండావాసుల విజ్ఞప్తి వేరకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సానుకూల దృక్పథంతో ఎర్రవల్లి గోకారం రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించి ముంపునకు గురికాకుండా గ్రామాలను కాపాడాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని వీలైనంత త్వరగా కాపాడేందుకు చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షులు నేనావత్ నాగయ్య ఉపాధ్యక్షులు ఏకుల ప్రకాష్, పబ్బు పెద్దయ్య, పర్వతాలు, భూ నిర్వాసితులు పాల్గొన్నారు.






