- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమ న్యాయం 'లోక్ అదాలత్' తోనే సాధ్యం
కోర్టు కేసుల్లో ఇరు వర్గాలకు సమ న్యాయం జరగాలంటే కేవలం లోక్ అదాలత్ తోనే సాధ్యం అని ఎస్పీ జానకి అన్నారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : కోర్టు కేసుల్లో ఇరు వర్గాలకు సమ న్యాయం జరగాలంటే కేవలం లోక్ అదాలత్ తోనే సాధ్యం అని ఎస్పీ జానకి అన్నారు. ఆదివారం ఎస్పీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ, ప్రజలకు తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో న్యాయం అందించేందుకు ఈనెల 20 న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ లో వివిధ రకాల పెండింగ్ కేసులు, ట్రాఫిక్ చలానాలు, రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్ కేసులు, కుటుంబ వివాదాలు, సివిల్ తగాదాలు తదితర అంశాలను పరస్పర అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం ఉందని ఆమె అన్నారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న వివాదాలను సామరస్యపూర్వకంగా ముగించేందుకు ఇది మంచి అవకాశమని, ప్రజలు తమ కేసులకు సంబంధించిన వివరాలను సంబంధిత కోర్టులు, న్యాయవాదులు లేదా పోలీసు అధికారులను సంప్రదించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోంటూ, ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ జానకి సూచించారు.






