పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి : కలెక్టర్ ఖుష్బూ గుప్త

by Ratna Kumari |

పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని కలెక్టర్ ఖుష్బూ గుప్త అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె భూత్పూర్ మున్సిపాలిటీలో పర్యటించి పరిశుభ్రత కార్యక్రమాలు పరిశీలించారు.

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి :   కలెక్టర్ ఖుష్బూ గుప్త
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని కలెక్టర్ ఖుష్బూ గుప్త అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె భూత్పూర్ మున్సిపాలిటీలో పర్యటించి పరిశుభ్రత కార్యక్రమాలు పరిశీలించారు. అక్కడి పంచవటి హోటల్ ను సందర్శించి చెత్త సేకరణ గురించి తెలుసుకుని, ప్రతి రోజు తడి, పొడి చెత్త వేరు చేయాలని తెలిపారు. అనంతరం కెజిబివి ని సందర్శించి, అక్కడి వంట గదిని సందర్శించి, వండిన అన్నం ను పరిశీలించగా మెత్తగా ఉండడాన్ని చూసి అసహనం వ్యక్తం చేస్తూ, జాగ్రత్తగా వంట చేయాలని సున్నితంగా హెచ్చరించారు. విద్యార్థులకు పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అధికారులకు సూచించారు. పదవ తరగతి గదిలోకి వెళ్ళి విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. అలాగే పాఠశాలలో పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని, మూత్రశాలలు,మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సూచించారు. పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ, పదవ తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఆందోళన చెందకుండా బాగా చదివి పరీక్షలు మంచిగా రాయాలని అన్నారు. ఏ సబ్జెక్టు లోనైనా విద్యార్థినులకు సందేహాలు ఉన్నా వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. 'రాష్ట్రీయ బాల్ స్వాస్త్' కార్యక్రమం ద్వారా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం కలెక్టర్ గమనించి, నిత్యం ఎంతోమంది విద్యార్థిని లకు వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారని అడుగగా, రోజూ 70 మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని అక్కడి వైద్యులు తెలిపారు.

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించండి

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్త అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి మొత్తం 119 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు లను స్వయంగా అందుకున్న కలెక్టర్ సంబంధిత అధికారులు వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు హరిప్రియ, మధుసూదన్ నాయక్ పాల్గొన్నారు.

Next Story