వేసవిలో మంచినీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలి : మేయ‌ర్ మ‌మ‌త

by Nallavelli.Anjaneyulu |

రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని రోజు రోజుకూ ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో నగరంలోని అన్ని వార్డుల్లో అంతరాయం లేకుండా నీటి సరఫరా జరిగేలా చూడాలని నగరపాలక మేయర్ మమత, డిఫ్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్, ముడా చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్ లు మున్సిపల్ సిబ్బందికి ఆదేశించారు.

వేసవిలో మంచినీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలి :   మేయ‌ర్ మ‌మ‌త
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని రోజు రోజుకూ ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో నగరంలోని అన్ని వార్డుల్లో అంతరాయం లేకుండా నీటి సరఫరా జరిగేలా చూడాలని నగరపాలక మేయర్ మమత, డిఫ్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్, ముడా చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్ లు మున్సిపల్ సిబ్బందికి ఆదేశించారు. బుధవారం మున్సిపల్ కార్పోరేషన్ సమావేశ మందిరంలో కమిషనర్ రామానుజుల రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్లు, పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లు, మిషన్ భగీరథ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు మాట్లాడారు. ఎక్కడైనా పైప్ లైన్ లీకేజీ లు ఉండి,నీరు వృధాగా పోతుంటే వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని మేయర్ మమత, డిఫ్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి లు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నీటి ఎద్దడి ఉన్న ఎతైన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే మంచినీటి సరఫరా పై డివిజన్లలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఉండాలని, పరిశీలనలో బోర్లు సరిగ్గా పనిచేయడంలేదని ఫిర్యాదులు అందితే వెంటనే మరమ్మత్తులు చేయించాలని ఆదేశించారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, మంచినీటి సరఫరా వేళలు ఖచ్చితత్వం పాటించాలని వారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, డిఇఓ లు గీత, శ్రీనివాస్ గౌడ్, ఏఈ లు, మహేష్, రాఘవేందర్, పబ్లిక్ అండ్ హెల్త్ విభాగం మున్సిపల్ ఇంజనీర్ విజయభాస్కర్ రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.

Next Story