- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత : చైల్డ్ హెల్ప్ లైన్ కో ఆర్డినేటర్ శివలీల
దిశ, గట్టు : బాల్య వివాహల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని 1098 చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ శివలీల అన్నారు. శుక్రవారం మండలంలోని బోయలగూడెం

దిశ, గట్టు : బాల్య వివాహల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని 1098 చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ శివలీల అన్నారు. శుక్రవారం మండలంలోని బోయలగూడెం జిల్లా పరిషత్ పాఠశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ 1098 చైల్డ్ హెల్ప్ లైన్ ఆధ్వర్యంలో బాల్య వివాహ ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాలు, బాలల సంక్షేమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ శివలీల మాట్లాడుతూ బాలల సంక్షేమం కోసం చైల్డ్ హెల్ప్ లైన్ 1098 అను టోల్ ఫ్రీ నెంబర్ దేశ వ్యాప్తంగా పని చేస్తుందని, 24 గంటలు సేవలు అందించే ఉచిత హెల్ప్ లైన్ నెంబర్ అని అన్నారు. పిల్లలు స్వేఛ్చాయుత వాతావరణంలో పెరగాలని ఆకాంక్షించారు. బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2012 గురించి వివరిస్తూ ఈ చట్టం బాలలకు రక్షణ కల్పిస్తుందని పేర్కొన్నారు. బాల కార్మికులు గా ఎవరైనా పని చేస్తున్న కూడా ఆ పిల్లలను రిస్క్యూ చేసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరచడం జరుగుతుందన్నారు. బాల కార్మిక నిషేధ చట్ట ప్రకారం పనిలో ఉంచుకున్న యజమాని తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. బేటి బచావో బేటి పడావో పథకం గురించి మహిళల సాధికారత గురించి వివరించారు. కార్యక్రమంలో సోషల్ వర్కర్ పద్మ, చిట్టెమ్మ, విమల, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.






