జూన్ 2 నాటికి ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : టీజీఈజేఏసీ

by Ratna Kumari |

జూన్ 2 నాటికి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమబాట పడతామని తెలంగాణ ఎంప్లాయిస్, టీచర్స్, పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ హెచ్చరించింది.

జూన్ 2 నాటికి ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : టీజీఈజేఏసీ
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : జూన్ 2 నాటికి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమబాట పడతామని తెలంగాణ ఎంప్లాయిస్, టీచర్స్, పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ హెచ్చరించింది. ఈ మేరకు శుక్రవారం మహబూబ్ నగర్ అర్భన్ తహశీల్దార్ కార్యాలయంలో తహసిల్ధార్ ఘాన్సీరాం కు వారు విన్నతీ పత్రాన్ని సమర్పించారు. వెంటనే పిఆర్సీ అమలు, పెండింగ్ డిఏల విడుదల, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్స్ క్లియరెన్స్, సీపీఎస్ రద్దు చేసి ఓపిఎస్ పునరుద్ధరణ చేయాలని, 61 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల వారసత్వ సమస్య, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీజీటీఏ, టీజీఆర్ఎస్ఎ, టీపీయూఎస్, టీజీసీపీఎస్ఈయు లతో కూడిన టీజీ ఈజేఏసీ భాగస్వామ్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story