సాయి కృప ఆసుప‌త్రిలో ఆక‌స్మిక త‌నిఖీ..!

by Ratna Kumari |

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో సాయి కృప హాస్పిటల్ లో డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా రవి కుమార్ నాయక్ తో పాటు స‌ర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్ మహేష్, ఎస్సైలు సురేష్,సతీష్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.

సాయి కృప ఆసుప‌త్రిలో ఆక‌స్మిక త‌నిఖీ..!
X

దిశ, కొల్లాపూర్ : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో సాయి కృప హాస్పిటల్ లో డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా రవి కుమార్ నాయక్ తో పాటు స‌ర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్ మహేష్, ఎస్సైలు సురేష్,సతీష్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. సాయంత్రం 4: 30 గంటలకు మొదలైన తనిఖీలు రాత్రి 10 గంటల వ‌ర‌కు కూడా ఆసుప‌త్రిలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా డీ ఎం హెచ్ఓ రవి కుమార్ నాయక్ మీడియా తో మాట్లాడుతూ పట్టణంలోని సాయి కృప హాస్పిటల్ లో మైనర్ బాలిక కు అబార్షన్ జరిగిందని డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్ తనకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంయుక్తం గా తనిఖీలు నిర్వహించామన్నారు.

హాస్పిటల్ లో ఓపీ రికార్డుల తో పాటు వివిధ రకాల రికార్డులను పరిశీలించి ఆధారాలు సేకరిస్తునట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలోనీ స్కానింగ్ సెంటర్ లో ఉన్న పరికరాల గదిని తాళం వేస్తామన్నారు. ఆస్పత్రి లో ఇంకా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. అయితే రిపోర్టులను అంత స్టడీ చేస్తామని, ఇదే విషయం పై రాత్రికి, లేదా ఉదయం కలెక్టర్ దృష్టి కి తీసుకెళ్తామన్నారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో ఒక కమిటీ ఉందని, ఆ కమిటీలో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ రవి కుమార్ నాయక్ వెల్లడించారు. ఈయనతో పాటు డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్, లింగాల ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి డా:జయచంద్ర ప్రసాద్ యాదవ్, వైద్య సిబ్బంది ఉన్నారు.

Next Story