ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న విద్యుత్ అధికారులు.!

by Ratna Kumari |

దిశ‌, గోపాల్ పేట : వ‌న‌ప‌ర్తి జిల్లా గోపాల్ పేట మండ‌ల కేంద్రంలోని చాక‌ల్ ప‌ల్లికి వెళ్లే ప్ర‌ధాన ర‌హ‌దారిలో మూల‌మ‌లుపు వ‌ద్ద ఎన్టీఆర్ విగ్ర‌హం, మిషన్ భగీరథ కు సంబంధించిన హౌస్, ము

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న విద్యుత్ అధికారులు.!
X

దిశ‌, గోపాల్ పేట : వ‌న‌ప‌ర్తి జిల్లా గోపాల్ పేట మండ‌ల కేంద్రంలోని చాక‌ల్ ప‌ల్లికి వెళ్లే ప్ర‌ధాన ర‌హ‌దారిలో మూల‌మ‌లుపు వ‌ద్ద ఎన్టీఆర్ విగ్ర‌హం, మిషన్ భగీరథ కు సంబంధించిన హౌస్, ముఖ్యంగా విద్యుత్ కరెంటు స్తంభం చాలా ప్రమాదకరంగా బీటీ రోడ్డుకు అడ్డంగా ఉంది. గోపాల్ పేట మండల కేంద్రంలో బస్టాండ్ ముందు చాకల్ పల్లి రోడ్డులో గత చాలా సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభం వల్ల తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా విద్యుత్ స్తంభం ఉన్న ప్రాంతం రోడ్డు ఎత్తు పెరిగినందున వాహనాలకు విద్యుత్ వైర్లు తగిలే అవకాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. అలాగే రోడ్డుకు మధ్యలో ఉన్నందులో వాహనాలు వేలుటకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యుత్ పోలు చాలా ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినందున ఈ పోలు శిథిలావస్థలో ఉండి వైర్లు కూడా తెగిపోయే అవకాశాలు కలదు. ఈ విషయంపై ఇదివరకే సంబంధిత విద్యుత్ అధికారుల దృష్టికి కూడా తీసుకువచ్చాం. కానీ నేటి వరకు ఎలాంటి చర్యలు లేవు. గ్రామస్తులపై దయవుంచి ఎత్తు తక్కువగా ఉండి ప్రమాదకరంగా రోడ్డుకు అడ్డు ఉన్న విద్యుత్ పోలను తొలగించి దాన్ని స్థానంలో ఎత్తు ఎక్కువగా ఉన్న రోడ్డుకు అడ్డులు లేకుండా ప్రజలకు ఇబ్బందులు లేని చోట ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులు తొలగించగలరని గోపాల్ పేట‌ గ్రామస్తులు కోరారు.


గతంలో ప్రజావాణి ద్వారా కలెక్టర్ కి ఫిర్యాదు చేయగా సంబంధిత ఎంపీడీవో కి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఎంపీడీవో ఇవాళ వస్తాం.. రేపు వస్తాం అని కాలయాపన చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని గోపాల్ పేట‌ ప్రజలు అంటున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ విగ్రహం బిటి రోడ్డు మధ్యలో ఉండటం వల్ల చాకలి పెళ్లి గ్రామానికి బస్సులు వెళ్లడానికి ఇబ్బందిగా మారుతుందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.దయచేసి ఎన్టీఆర్ విగ్రహం కూడా బిటి రోడ్డు మీద కాకుండా ఒక పక్కకు పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడవలసిందిగా స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఎన్టీఆర్ విగ్రహం వల్ల వారంలో రెండు మూడు యాక్సిడెంట్ జరుగుతున్నాయని ప్రజలు తెలియజేస్తున్నారు. ఈ ఎన్టీఆర్ విగ్రహం, మిషన్ భగీరథ సంపు, ఈ కరెంటు స్తంభం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోని అధికారులు చోద్యం చూస్తూ ఇది మా పరిధిలోకి రాదులే ఎవరి ప్రాణం పోతే మాకెందుకులే అనే విధంగా తయారైన అధికార యంత్రాంగం. అదేవిధంగా గోపాల్పేట ఏఈ హర్షవర్ధని దిశ వివరణ కోరగా ఈ విషయం కొద్దిగా అబ్జెక్షన్ లో ఉంది. ఆర్ అండ్ బి వాళ్లతో మాట్లాడి చర్యలు తీసుకుంటామ‌ని తెలిపారు.

Next Story