ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి : వికలాంగుల హక్కుల జాతీయ వేదిక

by Ratna Kumari |

ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాల‌ని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు కోట్ల గౌతమ్, దామోదర్ పేర్కొన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి : వికలాంగుల హక్కుల జాతీయ వేదిక
X

దిశ, వంగూర్ : ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాల‌ని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు కోట్ల గౌతమ్, దామోదర్ పేర్కొన్నారు. మండ‌ల కేంద్రంలో శుక్ర‌వారం వారు విక‌లాంగుల స‌మ‌స్య‌లపై మాట్లాడారు. ఎన్నికల సమయంలో గెలిచిన వంద రోజుల్లో బస్సుల్లో పురుష వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, వికలాంగుల పెన్షన్ 6వేల రూపాయలకు పెంచుతామని, బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింద‌ని గుర్తు చేశారు. అలాగే 2016 వికలాంగుల రక్షణ చట్టాన్ని మరింత పటిష్ట పరుస్తామని ప్రధానమైన హామీలు ఇచ్చిందని.. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు దాటిన ఇప్పటివరకు ఇచ్చిన హామీలు ఏ ఒక్క‌టి అమ‌లు కాలేద‌న్నారు.


వీటి అమలు కోసం తమ సంఘం పోరాడుతూ ఉందని ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడంలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగుల స్వయం సహాయక సంఘాల ఏర్పాటు నత్త నడకన సాగుతుందని అన్నారు. జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు బ్యాక్ లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయలేదని అన్నారు. 2011 నుంచి కేవలం 300 రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తున్నారని.. ప్రస్తుత ధరలకు అవి ఏమాత్రం సరిపోవని అన్నారు. 2016 వికలాంగుల రక్షణ చట్టం నిర్వీర్యయానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆరోపించారు. అన్ని రకాలుగా వెనకబడి ఇబ్బందులు పడుతున్న వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వాలు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు.

Next Story