- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వంగూరు మండల ఉపసర్పంచుల సంఘం నూతన కమిటీ ఎన్నిక
27 గ్రామాల ఉపసర్పంచుల సమక్షంలో మండల ఉపసర్పంచుల సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

దిశ, వంగూరు: జిల్లా ఉపసర్పంచుల సంఘం అధ్యక్షుడు వారణాసి శ్రీను ఆధ్వర్యంలో మంగళవారం వంగూరు మండల ఉప సర్పంచ్‌ల ఫోరం సమావేశం నిర్వహించి, నూతన మండల కమిటీని మండలంలోని 27 గ్రామాల ఉపసర్పంచుల సమక్షంలో మండల ఉపసర్పంచుల సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడిగా వంగూరు గ్రామ ఉపసర్పంచ్ బండపల్లి భాస్కర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షురాలిగా మిట్ట సదగోడు ఉపసర్పంచ్ జంగిటి రజిత మనోహర్, గౌరవాధ్యక్షుడిగా డిండి చింతపల్లి ఉపసర్పంచ్ గంధం సత్యం, ప్రధాన కార్యదర్శిగా రంగాపూర్ ఉపసర్పంచ్ రామస్వామి, సహాయకార్యదర్శిగా ఉమ్మాపూర్ ఉపసర్పంచ్ స్వప్న సుధాకర్, కమిటీ సమన్వయకర్తగా ఉప్పలపహాడ్ ఉపసర్పంచ్ ఆర్కపల్లి బాలయ్య ఎన్నికయ్యారు.
ఎలాంటి సమస్యలు ఎదురైనా...
మిగతా ఉపసర్పంచులందరూ సంఘ సభ్యులుగా కొనసాగనున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షుడు బండపల్లి భాస్కర్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్న మండలంలోని అన్ని గ్రామాల ఉప సర్పంచ్ లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా మండలంలోని 27 గ్రామాల ఉపసర్పంచులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా సంఘం అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ అధికారులు లేదా ప్రభుత్వం నుంచి ఉపసర్పంచుల కు ఏ విధమైన ఇబ్బందులు ఎదురైనా సంఘం తరఫున పోరాడి వారి హక్కులను కాపాడుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర, జిల్లా నాయకత్వం సూచనల మేరకు వంగూరు మండల ఉపసర్పంచ్ ల ఐక్యతను మరింత బలోపేతం చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల ఉపసర్పంచులు తదితరులు పాల్గొన్నారు.






