- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నూతన టెన్నికాయిట్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
దిశ, వనపర్తి : ప్రతి క్రీడను, క్రీడాకారులను ప్రోత్సహిస్తామని వనపర్తి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి బొలమోని కుమార్ పేర్కొన్నారు.

దిశ, వనపర్తి : ప్రతి క్రీడను, క్రీడాకారులను ప్రోత్సహిస్తామని వనపర్తి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి బొలమోని కుమార్ పేర్కొన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వనపర్తి జిల్లాలోని టెన్నికాయిట్ సీనియర్ క్రీడాకారులు, ఫిజికల్ డైరెక్టర్లు, సమావేశం నిర్వహించి వనపర్తి జిల్లా నూతన టెన్నికాయిట్ అసోసియేషన్ ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర టెన్నికాయిట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గోపాల్ ఎన్నికల అబ్జర్వర్ గా వ్యవహారించారు.వనపర్తి జిల్లా టెన్నికాయిట్ నూతన అధ్యక్షులుగా సూర్య చంద్రశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శిగా రామచంద్రమ్మ, కోశాధికారిగా ఈశ్వరమ్మ ఎన్నుకున్నారు.నూతన కార్యవర్గం 2025-27 రెండు సంవత్సరాలు కొనసాగుతుంది. నూతన అధ్యక్షులుగా ఎన్నికైన సూర చంద్రశేఖర్ మాట్లాడుతూ.. జిల్లాలో టెన్నికాయిట్ క్రీడను అభివృద్ధి పథం లో ముందుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి బొలమోని కుమార్,కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కురుమయ్య, వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శేఖర్,తెలంగాణ పీడీ & పీ.ఈ.టీ. అసోసియేషన్ అధ్యక్షులు రామ్మోహన్,ప్రధాన కార్యదర్శి మన్యం యాదవ్, ఫిజికల్ డైరెక్టర్లు నిరంజన్ గౌడ్, మధు,ఆకుల వెంకటయ్య, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.






