ఉత్కంఠ వీడిన అలంపూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక

by Bhoopathi Nagaiah |

హంగ్ దిశగా ఉన్నఅలంపూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఎక్స్ అఫిషియో ఓటుతో అధికారాన్ని దక్కించుకుంది.

ఉత్కంఠ వీడిన అలంపూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక
X

దిశ, అలంపూర్ టౌన్: అలంపూర్ పురపాలికలో 10 వార్డులు ఉండగా, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చెరి ఐదు సీట్ల చొప్పున గెలిచాయి. దీంతో ఇక్కడ హంగ్ ఏర్పడడంతో చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. అలంపూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం కౌన్సిల్ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మునిసిపల్ చైర్మన్ ఎన్నికలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నుండి చైర్మన్ అభ్యర్థిగా ఆరో వార్డు కౌన్సిలర్ పి.జయ రాముడిని ఏడోవాడు కౌన్సిలర్ మోహన్ రెడ్డి ప్రతిపాదించగా, తొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ మాధురి బలపరిచారు. అదేవిధంగా కాంగ్రెస్ తరపున ఒకటవ వార్డు కౌన్సిలర్ స్వాతిని నాలుగో వార్డ్ కౌన్సిలర్ ఈరమ్మను ప్రతిపాదించగా రెండో వార్డ్ కౌన్సిలర్ రాజ్యలక్ష్మి బలపరిచారు. ఇరు పార్టీలు సమానంగా ఉండటంతో బీఆర్ఎస్‌కు ఎమ్మెల్యే విజయుడు చెయ్యేత్తి మద్దతు తెలియడంతో పిండి జయరాముడును అధికారులు అలంపూర్ మున్సిపల్ చైర్మన్‌గా ప్రకటించారు. అదేవిధంగా వైస్ చైర్మన్‌గా 10వార్డు కౌన్సిలర్ ఎరుకలి విక్రమ్ ను ఎన్నుకున్నారు.

చైర్మన్ ఎన్నికను పర్యవేక్షించిన ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామిరెడ్డి

మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి మొదటి నుండి ప్రతిష్టాత్మకంగా తీసుకొని పర్యవేక్షించారు. గెలిచిన అభ్యర్థులను ఎమ్మెల్యేతో కలిసి స్వయంగా ప్రమాణ స్వీకారానికి తీసుకువచ్చారు. చైర్మన్ ఎన్నిక ముగిసే వరకు కార్యాలయం బయటే ఉండి కార్యకర్తలు నాయకులతో కలిసి పరిశీలించారు. ఎన్నిక అనంతరం బయటికి వచ్చిన చైర్మన్, వైస్ చైర్మన్‌లను అభినందించారు. ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలతో మున్సిపల్ కార్యాలయం బయట ఉత్కంఠ నెలకొంది. అలంపూర్ సీఐ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సజావుగా సాగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Next Story