- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎనిమిదో తరగతి విద్యార్థినికి రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ లో అవకాశం
దిశ, మహమ్మదాబాద్ : మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నంచర్లకు చెందిన విద్యార్థిని రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ లో అవకాశం లభించింది. జోగులాంబ గద్వాల

దిశ, మహమ్మదాబాద్ : మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నంచర్లకు చెందిన విద్యార్థిని రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ లో అవకాశం లభించింది. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ లో 69వ ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అండర్ 14 బాలికల కబడ్డీ పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ పోటీలలో మహబూబ్ నగర్ జిల్లా జట్టు రన్నరప్ గా నిలిచింది. జిల్లా జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన మహమ్మదాబాద్ మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నంచర్ల కు చెందిన సి. చందన (8వ తరగతి) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆమె ప్రతిభను గుర్తించి అండర్-14 బాలికల ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. చందన ఈ నెల 16 నుంచి 18 వరకు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో జరగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్‌లో పాల్గొననుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పీడీ, ఉపాధ్యాయ బృందం చందనను అభినందిస్తూ, ఆమె రాష్ట్రస్థాయి పోటీల్లో విజయాన్ని సాధించి జిల్లా, పాఠశాలకు గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు. స్థానిక విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా చందన విజయంపై ఆనందం వ్యక్తం చేశారు.






