- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుష్టు వ్యాధి నివారణకు కృషి చేయాలి: జిల్లా వైద్యాధికారి సాయినాథ్ రెడ్డి
జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరు కుష్టు వ్యాధి నివారణకు కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి సాయినాథ్ రెడ్డి అన్నారు.

దిశ, పాన్ గల్: జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరు కుష్టు వ్యాధి నివారణకు కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి సాయినాథ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రాన్ని జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పరిమళ, మండల ప్రాథమిక వైద్యాధికారి చంద్రశేఖర్, సర్పంచ్ మహమ్మద్ వహీద్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. జాతిపిత కుష్టు వ్యాధి నివారణ కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితో ప్రతి ఏటా కుష్టు వ్యాధి నివారణ జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టి వ్యాధి గ్రస్తులను గుర్తించి చికిత్స నిర్వహించడం జరుగుతుందన్నారు. అందుకు ప్రతి ఒక్కరు కుష్టు వ్యాధి నివారణకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్యాధికారిణి మైథిలి ఏఎన్ఎం రేవతి, తదితరులు పాల్గొన్నారు.






